సురవరం పేరుపై బీజేపీ అభ్యంతరం

4
- Advertisement -

పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ కి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. పొట్టిశ్రీరాములు అంటే గుర్తుకొచ్చేది యూనివర్సిటీ.. పొట్టిశ్రీరాములు ఒకప్రాంతానికి చెందినవారు కాదు గాంధీతో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు అన్నారు.

కుళం, జాతికోసం పనిచేసిన వ్యక్తి గాదు పొట్టిశ్రీరాములు.. దేవలయాల్లోకి అందరికి అనుమతి ఉండాలని కోరిన వ్యక్తి అన్నారు. భాషపరమైన పునాది ఉందంటే అది పొట్టిశ్రీరాములు ఘనత.. తెలంగాణ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సురవరాం ప్రతాపరెడ్డి అతని పేరు ఉస్మానియా యూనివర్సిటీ కి పెట్టాలని మా డిమాండ్ చేశారు.

శాసనసభ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మేము ఖండిస్తూన్నాం.. ఆర్యవైశ్యులకు ఆరాధ్య దైవం పొట్టిశ్రీరాములు అన్నారు. ఆర్య వైశ్యులు మృదుస్వభావులు, దేశ ,రాష్ట్ర సంపదలు ఎన్నో సత్రాలు నడుస్తున్నాయి.. ఆర్యవైశ్యుల డిమాండ్స్ నెరవేర్చకపోతే ప్రభుత్వం పై ఉద్యమం చేస్తాం అన్నారు. చర్లపల్లికి పేరు తీయడం ఎందుకు ,పెట్టడం ఎందుకు.. ఆర్య, వైశ్యులు మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం చూడాలి అన్నారు.

Also Read:TTD: తెలంగాణ సిఫార్సు లేఖలకు అనుమతి

- Advertisement -