రాజాసింగ్‌పై వేటు పడింది ఎందుకో తెలుసా..!

98
rajasingh
- Advertisement -

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై వేటు పడింది. ఓవర్గం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనను పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ అధిష్టానం మంగళవారం నాడు నిర్ణయం తీసుకుంది. ఓ వర్గంపై వివాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్‌పై పలు పోలీసు స్టేషన్‌లో వరుస పిర్యాదులు అందిన విషయం తెలిసిందే. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా వివాదం రేపాయి. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హంతో బీజేపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఎందుకు బ‌హిష్క‌రించ‌కూడ‌దో 10రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. వచ్చే నెల 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది.

మంగళ్‌హాట్‌లో ఖాదీర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. 14వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాజసింగ్‌కు 14రోజుల రిమాండ్ విధించారు.

ప్రముఖ కమెడియన్‌ మునావర్‌ ఫారూకి షో సంద‌ర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ వర్గం ఆరోపిస్తున్నది. ఈ మేరకు పలువురు నగర పరిధిలోని పలు స్టేషన్లలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి నగరంలోనూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ మనోభావాలను రాజాసింగ్‌ దెబ్బతీశారని ఆందోళనకారులు ఆరోపించారు.

- Advertisement -