- Advertisement -
ప్రతి సారి లాగే ఈ ఏడాదీ శ్రీ రామ నవమి శోభ యాత్ర జరుగుతుంది అన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్ . ఏప్రిల్ 6న శోభ యాత్ర జరుగుతుంది.. ఈ ఏడాది వైభవంగా జరుపుకునేందుకు గాను శోభ యాత్ర జరిగే మొత్తం రోడ్డు రూట్ ను పరిశీలించాను అన్నారు.
పర్యవేక్షణలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు..రోడ్డు మ్యాప్‌లో ఎలాంటి ఇబ్బందీ రాకూడదు… ప్యాచ్ వర్క్ గానీ.. ట్రీ కటింగ్ గానీ.. లైట్లు గానీ…అన్ని పనులను బాగా చేయాలని అధికారులను కోరాం అన్నారు.
ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పోలీసుల వల్లే ఇబ్బంది అవుతోంది… కార్యకర్తలను తోసేస్తారు.. రామ భక్తులను కొట్టేందుకు పోతారు…. ఇలాంటివి జరగకుండా చూడాలని కోరాం అన్నారు.
Also Read:బెట్టింగ్ యాప్స్..పోలీస్ విచారణకు శ్యామల
- Advertisement -

