ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోంది. అసలే ఈ ఎన్నికల్లో యోగి సర్కార్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. మోదీ, అమిత్‌షాలు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసినా…బీజేపీ గెలిచే సీన్ కనిపించడం లేదు..తొలుత ఫేక్ సర్వేలతో అనుకుల ఛానళ్లలో బీజేపీ గెలుస్తుందని మోదీ, అమిత్‌షాలు చేయించిన జిమ్మిక్కులు ఫెయిల్ అయ్యాయి. యుపీలో అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకు తగినట్లుగానే మొదటి విడత ఎన్నికల్లో ఎస్పీ కంటే బీజేపీ వెనుకబడిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో వివాదాస్పద తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రెచ్చిపోయారు. యుపీలో బీజేపీకి, యోగికి ఓటేయాల్సిందే…యోగికి ఓటేయని వారి ప్రాంతాలను గుర్తిస్తాం…జేసీబీలు, బుల్డోజర్లు మీ ప్రాంతాలకు వస్తాయి…బీజేపీకి ఓటేయని వారి ఇండ్లను బుల్డోజర్లతో కూలుస్తాం…యుపీలో ఉండాలంటే.. యోగికి ఓటేయాల్సిందే అని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి.
రాజాసింగ్ బుల్డోజర్ వ్యాఖ్యలపై యుపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్నటి వరకు బీజేపీ, ఎస్పీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. కాని ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యల తర్వాత వార్ వన్ సైడ్ అయిపోయింది. ఓటేయకపోతే బుల్డోజర్లతో మా ఇండ్లను కూల్చడం కాదు..మేమే మా ఓటుతో యోగి సర్కార్‌ను కూలుస్తామని యుపీ ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే సుల్తాన్‌పూర్ ఎన్నికల ప్రచార సభకు ఇరువైపులా నాలుగు బుల్డోజర్లు పెట్టి వాటికి బుల్డోజర్ కా బాబా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని యోగి హెలీకాప్టర్‌లో కూర్చుని వీటిని చూసుకుంటూ మురిసిపోతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. యుపీలో బీజేపీ సీఎం యోగిని బుల్డోజర్ కా బాబా అంటూ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం యోగి సభలో బుల్డోజర్ కా బాబా పేరుతో ఏర్పాటు చేసిన బుల్డోజర్లు హాట్‌టాపిక్‌గా మారాయి. తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ యుపీలో పార్టీ కొంపముంచాడని అక్కడి బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం బుల్డోజర్ కా బాబా పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో బీజేపీకి తలవంపుగా మారింది. బీజేపీ ఓటమికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.