కాంగ్రెస్ సర్కార్ పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్ చేసి కుంభకోణం చేశారని..దీనిపై ఈడీ,సీబీఐ విచారణ జరపాలని కోరుతామన్నారు మహేశ్వర్ రెడ్డి.
అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి..శోధ, గజా, కేఎన్ఆర్ కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారన్నారు. ఎస్టిమెట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకున్నారు…. రూ. 600 కోట్లతో అయ్యే పనికి వెయ్యి కోట్ల రూపాయలుగా ఎస్టిమెట్లు తయారు చేశారని ఆరోపించారు. ఒక్క జీవోను కూడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం లేదు…. టెండర్ డాక్యుమెంట్స్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు.
మెగా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల పనులు ఎలా అప్పగించారు..? ఏడు నెలల్లో చేసిన చీకటి ఒప్పందాలకు, టెండర్లకు.. విచారణకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో చీకటి కోణంలో చీకటి పాలన కొనసాగుతోందని విమర్శించారు.
Also Read:వైభవంగా కల్యాణ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు