HILT Scam:ఉత్తమ్‌కు ఏలేటి సవాల్

6
- Advertisement -

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి BRS ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి HILT స్కాంపై సంచలన సవాల్ విసిరారు. HILT స్కాంను తాను సాక్ష్యాధారాలతో నిరూపించకపోతే, రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్కాంను నిరూపించాలని సవాల్ చేస్తూ, నేను HILT స్కాంను సాక్షాదారాలతో నిరూపిస్తా. మరి దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? దమ్ముందా?” అని ప్రశ్నించారు.

తాను సాక్ష్యాధారాలతో అసెంబ్లీలో కూర్చుంటానని స్పష్టం చేసిన ఏలేటి, మంత్రి ఉత్తమ్ కు దమ్ముంటే, ఈ స్కాంపై నియమించిన సబ్ కమిటీ మంత్రులతో కలిసి అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:‘అఖండ 2’..మహా శివుని శక్తి చూస్తారు!

- Advertisement -