షా ఆఫర్‌..రాజ్యసభకు కపిల్..!

297
kapil
- Advertisement -

మరో లెజండరీ క్రికెటర్ పెద్దలసభలో అడుగుపెట్టబోతున్నారు. 1983లో భారత్‌కు ప్రపంచకప్‌ అందించి క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించిన కపిల్ దేవ్‌ త్వరలో రాజ్యసభకు ఎంపిక కాబోతున్నారు. పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాల్లో కపిల్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు ది హిందు పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ఇటీవలె సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ చీఫ్ అమిత్‌ కపిల్‌తో భేటీ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లిన షా బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. దీనికి కపిల్ కూడా సూచన ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కపిల్‌ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కపిల్‌తో పాటు బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ను సైతం రాజ్యసభకు నామినేట్‌ చేయాలని మోడీ భావిస్తున్నారని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.

ఒకవేళ ఇదినిజమైతే సచిన్ తర్వాత రాజ్యసభలోకి అడుగుపెట్టబోతున్న క్రికెటర్‌గా కపిల్ నిలవనున్నారు. సచిన్‌ రాజ్యసభ సభ్యత్వం కాలం ఇటీవలె ముగిసింది. అయితే, పదవీ కాలంలో సచిన్‌ పనితీరుపై తీవ్రంగా విమర్శలు రావడంతో తనకు వచ్చిన వేతనాన్ని తిరిగి ఇచ్చేశారు.

- Advertisement -