బీజేపీ మేనిఫెస్టో.. గట్టెక్కిస్తుందా ?

40
- Advertisement -

కర్నాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సౌత్ రాష్ట్రాలలో ఒక్క కర్నాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది ఇక్కడ కూడా అధికారం కోల్పోతే సౌత్ రాష్ట్రాలలో కాషాయ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కర్నాటకలో అధికారం జారిపోకుండా కమలనాథులు గట్టి ప్రణాళికలు రచిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని కన్నడ ప్రజలను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కర్నాటకలో ప్రస్తుతం బిజెపి సర్కార్ పై కొంత నెగిటివిటీ ఉంది. సి‌ఎం గా ఉన్న బసవరాజు బొమ్మై పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాగే పార్టీకి సొంత నేతల నుంచే అసమ్మతి సెగలు గట్టిగానే తగులుతున్నాయి. దీంతో ప్రజల్లో బీజేపీ ప్రభావం తగ్గిందనేది కొందరి అభిప్రాయం. ఇప్పటివరకు వచ్చిన సర్వేలు కూడా బీజేపీకి కొంత వ్యతిరేకంగానే ఉన్నాయి.

Also Read: మొక్కలు నాటిన సింగర్ శ్రేయా

ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి బీజేపీపై ఆ పార్టీ నేతల వద్ద ఉన్న ప్రధాన అస్త్రం మేనిఫెస్టో. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. అన్నీ వర్గాల ప్రజలను ఆకర్షించేలా దాదాపు 39 అంశాలాపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆహార కేంద్రాలు, రేషన్ కిట్టులు.. ఇలా చాలా వాటిపైనే బీజేపీ దృష్టి పెట్టింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఏడాదికి మూడు సార్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు బీజేపీ చెబుతోంది. అలాగే అన్నీ వార్డుల్లో ఆహార కేంద్రాలు, పోషణే లక్ష్యంగా ప్రతిరోజూ ప్రతి ఇంటికి అరలీటర్ నంది పాలు, ఇల్లు లేని పేదలకు సర్వరిగు షురూ యోజన కింద ఇళ్ల స్థలలు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అయిదేళ్ళ కాలానికి గాను పది వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్.. ఇలా ఎన్నో అంశాలను మేనిఫెస్టోలో ప్రకటించింది బిజెపి. మరి ఈ మేనిఫెస్టో బీజేపీని ఎంతవరకు గట్టెక్కిస్తుందో చూడాలి.

Also Read: CM KCR:ఇది తెలంగాణ పునర్నిర్మాణం అంటే

- Advertisement -