BJP Manifesto:హైలైట్స్ ఇవే

25
- Advertisement -

2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోడీతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు పాల్గొన్నారు.

ఈ మేనిఫెస్టోకు సంకల్ప్ పత్ర అనే పేరును పెట్టగా మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ నినాదమే లక్ష్యమని ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ రక్షణ, యువత, మహిళలు, రైతులపై వరాల జల్లు కురిపించింది. వచ్చే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

()వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్
()పెట్టుబడి ద్వారా గౌరవమైన జీవితం
()ఉద్యోగాల కల్పనపై దృష్టి
()70ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆయుష్మాన్ భారత్ పథకం
()విద్యుత్ బిల్లును సున్నాకు తగ్గించే ప్రయత్నం..ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం అమలు
() ముద్ర యోజన పథకం పరిమితి రూ. 20లక్షలకు పెంపు
()ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి ట్రాన్స్ జెండర్ లు
()దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
() ప్రతి ఇంటికి తక్కువ ధరకే సిలిండర్లు పంపిణీ
()పీఎం కిసాన్ సమ్మన్ నిధి కొనసాగింపు
()కూరగాయల ఉత్పత్తి చేసే వారికి క్లస్టర్లు ఏర్పాటు
()చిన్న రైతులకు లబ్ధి కలిగేలా శ్రీఅన్న్ రకం వరిసాగుకు ప్రోత్సాహం
()సముద్ర నాచు, ముత్యాల సాగుకు ప్రోత్సాహం
()తిరవల్లూరు కల్చరల్ సెంటర్
()స్వచ్ఛ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి లక్ష్యం
()నానో యూరియా వినియోగానికి ప్రోత్సాహం
()ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ అభివృద్ధి
()గిరిజన ప్రాంతాల్లో పర్యాటక రంగానికి ప్రోత్సాహం
()జాతీయ స్థాయిలో బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు
()గిరిజన వారసత్వంపై పరిశోధనల ప్రోత్సాహం, డిజిటల్ ట్రైబల్ ఆర్ట్ అకాడమీని ఏర్పాటు
() శాటిలైట్ పట్టణాల నిర్మాణం
()విమానయాన రంగాన్ని ప్రోత్సహించి లక్షల మందికి ఉపాధి
()త్వరలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు
()దేశం నలుమూలలా బుల్లెట్ రైళ్లు
()ఈవీ (ఎలక్ట్రానిక్స్ మోటార్) మార్కెట్ ల అభివృద్ధికి కృషి

Also Read:KCR:సమసమాజ స్థాపనే అంబేద్కర్ ధ్యేయం

- Advertisement -