- Advertisement -
దినేశ్ శర్మ అనే బీజేపీ నేతకు థామ్ నోడ్ ప్రాంతంలో ఘోర అవమానం జరిగింది. ఇంటింటి ప్రచారానికి వెళ్లి ఓట్లు అడుగుతుంటే, ఓ వ్యక్తి వచ్చి చెప్పుల దండను ఆయన మెడలో వేశాడు. దీంతో హుషారుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన షాక్ కు గురై, ఆ వెంటనే తేరుకున్నాడు. తొలుత చెప్పులను పక్కకు పడేసేందుకు ప్రయత్నించిన శర్మ, ఆ వక్తి తన ప్రయత్నాన్ని మానకపోవడంతో దండ వేయించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో థామ్ నోడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఆపై ఆయన మాట్లాడుతూ, తాను ప్రజల బిడ్డనని, తన నుంచి వారు ఏదో కోరుకుంటూ, తమలోని అసంతృప్తిని ఇలా వెల్లడించాడని చెప్పడం గమనార్హం. ఇక తాగు నీటి సమస్య అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం కలగలేదని, అందుకే ఈ పని చేశానని చెప్పుల దండను తెచ్చిన వ్యక్తి వ్యాఖ్యానించాడు.
- Advertisement -