బీజేపీ మాధవీలత ఆస్తులెన్నో తెలుసా?

31
- Advertisement -

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత సోషల్ మీడియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక ఇవాళ ఆమె నామినేషన్ దాఖలు చేయగా ఆస్తులు చూసి అంతా పరేషాన్ అయ్యారు.

కొంపెల్ల మాధవీలత తన మొత్తం రూ. 221.37 కోట్ల కుటుంబ ఆస్తులను ప్రకటించారు. ఆమెతో పాటు తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ ఇద్దరూ వ్యాపారవేత్తలు కాగా.. వారి ముగ్గురు పిల్లలకు రూ. 165.46 కోట్ల చరాస్తులు ఉండగా, మాధవీలత దంపతులకు కలిపి రూ.55.91 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో రూ.25.20 కోట్ల పెట్టుబడితో సహా రూ. 31.31 కోట్ల చరాస్తులు తనకు ఉన్నాయని ఆమె ప్రకటించారు. రూ. 3.78 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ,మాదవీలత భర్తకు విరించి లిమిటెడ్‌లో రూ.52.36 కోట్ల విలువైన షేర్లతో సహా రూ. 88.31 కోట్ల చరాస్తులు ఉన్నాయి.

బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఒక క్రిమినల్ కేసు కూడా ఉంది. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్టుగా ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Also Read:కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గమైన బాగుపడిందా?

- Advertisement -