బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం..!

40
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి…నేడు బీజేపీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి… ఆది నుంచి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకించిన వాళ్లలో ఒకరిగా నిలిచారు. విభజన సమయంలో సీఎంగా ఉన్న కిరణ్‌ ఆ తర్వాత జరిగిన పరిణమాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే. కాగా నేడు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో జాయిన్‌ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ పార్టీ సభ్యత్వాన్ని అందించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

2010 నుంచి 2014వరకు కిరణ్‌కుమార్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్్‌కు సీఎంగా పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్‌గా ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి 2014 ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఘోరాపరాజయం పాలయ్యారు. దీంతో సొంత గూటి అయిన కాంగ్రెస్‌లో చేరారు.

ఇవి కూడా చదవండి…

సూర్యపేటకు వృత్తి నైపుణ్యం కేంద్రం మంజూరు

Online Games: కేంద్రం కొత్త రూల్స్

గృహసారథులు.. వచ్చేస్తున్నారోచ్!

- Advertisement -