హుజురాబాద్‌లో బీజేపీ ఖాళీ…ఈటల ఓటమి ఫిక్స్…?

194
etela
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా ఈటల దురంహకారం భరించలేక బీజేపీ హుజూరాబాద్‌ పట్ణణ అధ్యక్షుడు నందగిరి మహేందర్‌రెడ్డితోపాటు సుమారు 600 మంది ఏబీవీపీ, బీజేపీ, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ ఇతర విద్యార్థి సంఘాల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. మహేందర్‌రెడ్డి మంచి నాయకుడని, అలాంటి నాయకుడినే కాపాడుకోలేకపోయావు.. ప్రజలను ఏం కాపాడతావని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం ఈటల పార్టీ మారినంత మాత్రా న.. ప్రజలు కూడా మారాలా?.. అబద్ధాలు నిజాలైతాయా? అని ప్రశ్నించారు.

ఇక్కడికి వచ్చి మేము అభివృద్ధి పనులు చేస్తే.. మీ కేంద్ర మంత్రులు చేతులు ఊపుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. పేద ప్రజలకు సొంత స్థలంలో ఇండ్లు కావాలంటే టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, గెల్లును గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తన ఆస్తులను కాపాడుకోవాలనే స్వార్థంలో ఈటల బీజేపీలోకి వచ్చాడన్నారు, ఆత్మగౌరవం అనే మాట నిజమైతే ఇరవైఏళ్లుగా పార్టీని పెంచిపోషించిన మమ్మల్ని ఎలా గెంటేస్తారన్నారు. పార్టీకోసం నిబద్దతతో పనిచేసిన ఏ ఒక్కరినీ దగ్గరికి తీసుకోవట్లేదని దుయ్యబట్టారు, బీసీ బిడ్డను అని మాట్లాడే ఈటలతన ఇంట్లో ఎంతమంది బీసీలున్నారో చెప్పాలన్నారు, ఏ బీసీని ఎదగనీయని నీచ వ్యక్తిత్వం ఈటలదని మండిపడ్డారు.

హుజురాబాద్ బిడ్డలు ఆత్మగౌరవం కలవారని, ఈటల లాంటి దురంహకారిని దగ్గరికి రానీయరని మహేందర్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. ధనబలంతోనే తాను గెలుస్తాననే అహంకార భావనతో ఈటల ఉన్నాడని.. రాజీనామా చేసిన రోజే ఆయన ఓటమి ఖాయమైందని మహేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందగిరి మహేందర్‌రెడ్డితో పాటు 600 మంది విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరడంతో ఈటల రాజేందర్‌కు, బండి సంజయ్‌లకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

- Advertisement -