పీఆర్సీపై బండి, అర్వింద్‌ల గుట్టు రట్టు..!

177
bjp
- Advertisement -

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం పీఆర్సీ ప్రతిపాదిస్తూ బిశ్వాల్ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే 7.5 శాతంకు బదులుగా తమకు ్కనీసం ఇదివరకులా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన బాట పడుతున్నారు. బిశ్వాల్ కమిటీ 7.5 శాతం పీఆర్సీ ప్రతిపాదించినా సీఎం కేసీఆర్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 27 నుంచి 33 శాతం వరకు పీఆర్సీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే పీఆర్సీ వివాదంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాజకీయం చేస్తున్నారు.

పీఆర్సీని ఫాం హౌస్‌లో లో కూర్చొని రాయించావా అంటూ సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఫిట్‌మెంట్ 7.5 శాతం ఇచ్చి హెచ్ఆర్ఏ 6 శాతం తగ్గించటం దారుణ‌మ‌ని, మోసమ‌ని ఆరోపించారు.. 31 నెలల నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణమైన ఫిట్‌మెంట్‌ను సమైఖ్య పాలకులు కూడా ఇవ్వలేదంటూ బండి సంజయ్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. అయితే పీఆర్సీపై బీజేపీ నేతలు మొదట ప్రశ్నించాల్సింది…కేంద్రంలోని మోదీ సర్కార్‌ను..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 7 th పే కమీషన్ సిఫార్సుల మేరకే తెలంగాణలో కూడా పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఎంత ఇస్తారో బండికి తెలుసా.. పీఆర్సీ లెక్కలపై కనీస నాలెడ్జ్ ఉందా..? కేంద్రంలోని బీజేపీ సర్కార్ కంటే తెలంగాణ టీఆర్‌ఎస్‌ ఎంతో మెరుగైన పీఆర్సీ ఇస్తోందన్న సంగతి కాషాయ నేతలకు తెలుసా… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి పదేళ్లకు ఒకసారి పీఆర్సీ ఇస్తారు..అదే తెలంగాణలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ ప్రకటిస్తారు. తమకు తెలంగాణలో ఇచ్చినట్లు పదేళ్లకు కాకుండా ప్రతి ఐదేళ్లకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు, ధర్నాలు చేసినప్పుడు ఈ బండి సంజయ్ ఎక్కడ ఉన్నాడు..బీజేపీ నేతలు నోరు ఎందుకు విప్పలేదు. మన రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ బిడ్డలు కాదా…తెలంగాణలో బిశ్వాల్ కమిటీ ప్రతిపాదించింది 7.5 శాతం అయినా…సీఎం కేసీఆర్ కచ్చితంగా ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్ ఇస్తారు..అందులో సందేహమే లేదు..అసలు బండి సంజయ్ నిజంగా ఉద్యోగులపై ప్రేమ ఉంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలను నిలదీయాలి. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ ప్రతి పదేళ్లకు ఒకసారి పీఆర్సీ ఎంత ఇస్తారో తెలిస్తే..బండి సంజయ్‌తో సహా బీజేపీ నేతలు సిగ్గుతో తలదించుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదేళ్ల తర్వాత ప్రకటించిన పీఆర్సీ కేవలం 2 శాతం..అందుకే బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసి కొంత మేర పెంచుకోగలిగారు.

ఇక తెలంగాణలో హెచ్ఆర్‌ఏ 6 శాతం తగ్గించడం దారుణమని బండి సంజయ్ ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు హెచ్ఆర్‌ఏ తగ్గడానికి కారణం కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిపాదించిన 7th పే కమీషన్ సిఫార్సులు కాదా…అసలు ఈ విషయం బండికి తెలుసో లేదో..నోటికి ఏది వచ్చినట్లు అది మాట్లాడడం..ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి రాజకీయ లబ్ది పొందడం..ఇదే బండికి తెలిసిన విషయం. ఇక 7 th పే కమీషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 17 వేలుగా నిర్థారించారు. 6 th పే కమీషన్ సవరణల మేరకు 7th కమీషన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం డీఏ, హెచ్ఆర్‌ఏలతో కలిసి 15750 రూపాయలు అయింది..దానికి కేంద్రం అదనంగా పెంచింది కేవలం 2250 రూపాయలు..అదీ పదేళ్ల తర్వాత…అదే తెలంగాణలో కనీస వేతనం 19 వేలుగా పీఆర్సీ కమిటీ నిర్థారించింది. అంటే 7 th పే కమీషన్ సిఫార్సుల మేరకు తెలంగాణలో కనీస వేతనం అన్నీ కలుపుకుని 17 వేలు అయింది. దాన్ని 19 వేలు చేయాలని పీఆర్సీ కమిటీ ప్రతిపాదించింది. అంటే తెలంగాణ ప్రభుత్వం 2 వేలు పెంచుతుంది. దీని ప్రకారం పదేళ్లకు కేంద్రం 2250 రూపాయలు పెంచితే.. కేసీఆర్ సర్కార్ ఐదేళ్లకు కనీస వేతనం రూ. 2000 పెంచింది..దీన్ని బట్టి బండి సంజయ్‌ ఎంత అడ్డగోలుగా మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది.

ఇక హెచ్ఆర్‌ఐ 6 శాతం తగ్గడానికి కారణం కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిపాదించిన 7th పే కమీషన్ సిఫార్సులే..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ హెచ్ఆర్‌ఏ తగ్గించింది. 7th పే కమీషన్ సిఫార్సుల మేరకే బిశ్వాల్ కమిటీ కూడా హెచ్ఆర్‌ఏ తగ్గిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అంత దారుణంగా మోదీ సర్కార్ మోసం చేస్తుంటే నోరు మెదపని బండి సంజయ్ తెలంగాణలో మాత్రం పీఆర్సీపై రగడ చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు..అయినా సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అడక్కుండానే 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు..ఇప్పుడు కూడా కనీసం ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యం పీఆర్సీ ప్రకటిస్తారు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఘోరాతి ఘోరంగా అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న బండి సంజయ్, అర్వింద్ వంటి బీజేపీ నేతల తీరును ప్రభుత్వ ఉద్యోగులు ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తంగా పీఆర్సీపై బండి సంజయ్ ఆడుతున్న దొంగ నాటకాలు లెక్కలతో సహా బయటపడడం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -