Bihar:బీజేపీ నేత దారుణ హత్య

6
- Advertisement -

బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో ఖేమ్కా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఒక బుల్లెట్, షెల్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

Also Read:వందా..బొందా..జడ్పీటీసీలను గెలిపించు!

సరిగ్గా మూడేళ్ల క్రితం ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇలాగే హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకులు హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

- Advertisement -