- Advertisement -
యుపీ ఎన్నికలు తుది అంకానికి చేరుకోగా తాజాగా అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయంక్…అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీలో చేరారు.ఆజంఘఢ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని గోపాల్పూర్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రచారం నిర్వహించగా.. ఆ ప్రచార సభా వేదికగా మయంక్.. ఎస్పీ కండువా కప్పుకున్నారు.
బ్రాహ్మణ సామాజికవర్గంలో ప్రాబల్యం కలిగిన మయంక్ జోషి.. ఎస్పీలో చేరడం కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. లక్నో నుంచి బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు మయంక్. అయితే బీజేపీ ఆయనకు మొండిచేయి చూపింది.
అయితే కొంతకాలంగా ఆయన ఎస్పీలో చేరుతారని ప్రచారం జరిగిన రీటా బహుగుణ జోషి మాత్రం తన కొడుకు బీజేపీని వీడరని చెబుతువచ్చారు. అయితే ఆ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ ఇవాళ ఎస్పీ కండువా కప్పుకున్నారు మయంక్.
- Advertisement -