ఏఐ సమిట్ వివాదం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూపై తీవ్ర ఆరోపణలు చేశారు. నెహ్రూ “రాజీ పడిన నాయకుడు” అని వ్యాఖ్యానిస్తూ, ఆయన కార్యాలయంలో సీఐఏ, కేజీబీ ఏజెంట్లు పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ, నెహ్రూ కార్యాలయంలో విదేశీ గూఢచార సంస్థల ప్రభావం ఎక్కువగా ఉందని సంబిత్ పాత్ర ఆరోపించారు. నెహ్రూ ప్రత్యేక సహాయకుడు ఎంఓ మాథాయిను అమెరికన్ ఏజెంట్‌గా పిలిచేవారని, 1960లలో కేజీబీ ఏజెంట్లు కూడా నెహ్రూ కార్యాలయంలో ఉన్నారని అన్నారు. అప్పట్లో విదేశీ ప్రభుత్వాలకు అవసరమైన పత్రాలు సులభంగా అందుబాటులో ఉండేవని వ్యాఖ్యానించారు.
పంచశీల్ ఒప్పందం ద్వారా టిబెట్‌ను చైనాకు అప్పగించారని పాత్ర ఆరోపించారు. అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా రహదారి నిర్మాణంపై ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ఇచ్చినా, నెహ్రూ దానిని పట్టించుకోలేదని అన్నారు. 1962 చైనా యుద్ధంలో భారత ఓటమికి కూడా నెహ్రూనే కారణమని, బీఎం కౌల్‌ను సైన్యాధ్యక్షుడిగా నియమించడం తప్పిదమని విమర్శించారు. చైనా, పాకిస్థాన్‌లకు భారత భూభాగాన్ని అప్పగించడానికి నెహ్రూ లంచాలు తీసుకున్నారా? అనే ప్రశ్నను కాంగ్రెస్ ప్రస్తుత నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు.
Also Read:Modi:ప్రధాని మోదీ అరుదైన ఘనత..

