కర్నాటకలో బీజేపీ ” ఖేల్ ఖతం ” !

31
- Advertisement -

కర్నాటకలో మళ్ళీ విజయం మాదే.. ? ఈసారి 160 సీట్లు పక్కా ? బీజేపీ విజయనికి తిరుగు లేదు..? కన్నడ ప్రజలు బీజేపీ వెంటే.. ఇలా ఎన్నికల ముందు కమలనాథుల కాన్ఫిడెంట్ మామూలుగా లేదు. ఎన్నికల ముందు ఆయా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, పలు విశ్లేషణలు అన్నీ కూడా కాంగ్రెస్ కే ఫేవర్ గా వచ్చినప్పటికి, తూచ్ అవన్నీ ఫేక్.. బీజేపీదే విజయం అంటూ కుండ బద్దలు కొట్టారు కాషాయ నేతలు.. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది ఘోరమైన ఓటమి దిశగా బీజేపీ దూసుకుపోతుంది. 2018 ఎన్నికల్లో 105 సీట్లు కైవసం చేసుకున్నా బీజేపీ ఈసారి 60-70 స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.

దీంతో దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్నాటక రాష్ట్రంలోని అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఓటమితో సౌత్ లో కమలం పార్టీ శూన్యంగా నిలిచింది. అయితే బిజెపి ఈ స్థాయిలో ఓటమి మూటగట్టుకోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. 2018 లో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టిన బీజేపీ ప్రజాకర్షణలో ఘోరంగా విఫలం అయింది. పేరుకే డబుల్ ఇంజిన్ సర్కార్ అయినప్పటికి, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అధివృద్ది జరగలేదనేది ఆ రాష్ట్రం ప్రజల నుంచి వినిపిస్తున్న మాట.

Also Read: కర్ణాటక హస్తగతం..డీకే గెలుపు

అంతేకాకుండా రాష్ట్రానికి తాము మాత్రమే దిక్కు అనేలా కమలనాథుల వైఖరి ఉండడం, అలాగే అధికార నేతలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు, బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం పై వ్యతిరేకత, అలాగే ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం వేసిన తప్పటడుగులు ఉదాహరణకు సీనియర్స్ ను పక్కన పెట్టేసి కొత్తవారికి సీట్లు ఎక్కువగా కేటాయించడం, దాంతో పార్టీలో తిరుగుబాటు చెలరేగడం.. ఎంతో మంది నేతలు పక్కా పార్టీలో చేరడం.. ఇలా ఎన్నో అంశాలు బీజేపీ ఓటమిని శాసించాయి. ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ గట్టి షాకే ఇచ్చారు కన్నడిగులు. అయితే ఈసారి ఎన్నికల్లో ఓటమిని కమలనాథులు ముందుగానే గమనించారని, అయినప్పటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని విశ్లేషకులు చెబుతున్నా మాట. మొత్తానికి ఎన్నికలల్లో ఓటమితో బీజేపీ సౌత్ రాష్ట్రాలలో ఖేల్ ఖతం అయిందనే చెప్పాలి.

Also Read: కాంగ్రెస్ కు భయం పట్టుకుందా ?

- Advertisement -