బీహార్‌..బీజేపీ-జేడీయూ 50-50 ఫార్ములా!

178
bjp

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఇప్పటికే మహాకూటమి సీఎం అభ్యర్ధిని కూడా ప్రకటించగా తాజాగా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయు-బీజేపీ ఓ అవగాహనకు వచ్చాయి.

మొత్తం 243 స్థానాలకు గాను 50- 50 ఫార్ములా ప్రకారం జేడీ-యు 122 సీట్లకు, బీజేపీ 121 స్థానాలకు పోటీ చేయనున్నాయి. జితన్ రామ్ మంఝి ఆధ్వర్యంలోని హిందుస్తానీ అవామీ మోర్ఛాకు జేడీ-యు కొన్ని సీట్లను కేటాయించనుంది. అలాగే రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి బీజేపీ కొన్ని స్థానాలను ఇవ్వనుంది.

ఇక మహాకూటమిలో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 70, వామపక్షాలు 29 స్థానాలలో పోటీ చేయనున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, వికాస్ ఇన్సాఫ్ పార్టీలకు ఆర్జేడీ తన సీట్ల నుంచి కేటాయించనుంది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ను ప్రకటించగా ఈ నెల 28 నుంచి మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి.