కమలం పార్టీ స్లో అయిందా?

37
- Advertisement -

తెలంగాణలో కాషాయ పార్టీ స్లో అయిందా ? అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న బీజేపీ.. రోజు రోజుకు మరింత స్లో అవుతోంది. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నిక ఫలితాల తరువాత కమలనాథులలో అసంతృప్తి పెరిగి వేగం తగ్గించినట్లు తెలుస్తోంది. మునుగోడులో మంచి పట్టున్న రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోని, మునుగుడు సీటు ను కైవసం చేసుకోవాలని భావించిన బీజేపీ అధిష్టానానికి గట్టి షాకే ఇచ్చారు ఆ నియోజక వర్గ ప్రజలు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడుపుతున్న బి‌ఆర్‌ఎస్ అభ్యర్థినే గెలిపించి.. కమలం పార్టీకి మొండి చెయ్ చూపించారు. .

ఇక నేతలను ఆకర్శించేందుకు ఈటెల రాజేందర్ ను చేరికల కమిటీ చైర్మెన్ గా నియమించి పెద్ద ఎత్తున బి‌ఆర్‌ఎస్ నుంచి నేతలను లాక్కునే ప్రయత్నం చేసిన.. ఆ ప్రయత్నలేవీ ఫలించలేదు. ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చూసి అడ్డంగా బుక్కైంది బీజేపీ అధిస్థానం. దాంతో ఎన్ని అడ్డ దారులు తొక్కిన బి‌ఆర్‌ఎస్ కు అడ్డుకట్ట వేయడం కష్టమని భావించిన కమలనాథులు దూకుడు తగ్గించినట్లే కనిపిస్తోంది. ఒక్క బండి సంజయ్ మాత్రమే పార్టీ తరుపున ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు తప్పా.. మిగిలిన కమలనాథులు ఎవరు కూడా యాక్టివ్ గా లేరనేది ఇంటర్నల్ గా నడుస్తున్న చర్చ.

ఎందుకంటే బీజేపీ దుశ్చర్యలు ప్రజలు గమనించడంతో ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోయిన ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు కూడా ప్రజల నుంచి అనుకున్న స్థాయిలో ఆధారణ లబించడం లేదు. దీంతో బీజేపీ అధిష్టానం ఏం పాలుపోని స్థితిలో ఉంది. ఇక ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో కాషాయ పార్టీ ఎంత దూకుడుగా వ్యవహరించిన ఫలితం మాత్రం శూన్యమే. ఎందుకంటే బీజేపీ అడ్డదారులు ప్రజలు స్పష్టంగా అర్థం కావడంతో.. ఏ దశలోనూ ప్రజా మద్దతు లభించే అవకాశం లేదనేది కమలనాథులకు కూడా స్పష్టంగా అర్థమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం పార్టీ డెడ్ స్లో గానే కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి…

నా బొచ్చు ఇస్తా.. ఏం జేస్తావో చెయ్!

కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు శ్రీకారం..

హెల్త్‌ చాలెంజ్..వందల మందికి రక్షణ

- Advertisement -