Etela Rajender:పాపం ఈటెల..బీజేపీ డీలా!

143
- Advertisement -

తానొకటి తాలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అనే సామెత ప్రస్తుతం బీజేపీ నేతలకు అతికినట్లు సరిపోతుంది. కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని కూల్చుతాం. బీజేపీని అధికారంలోకి తెస్తాం అంటూ జబ్బలు చారుస్తూ తొడలు కొట్టే కాషాయ నేతలు ప్రస్తుత పరిస్థితులను చిసి సైలెంట్ అవుతున్నారు. ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్ళి బీజేపీలో చేరిన ఈటెలతో బి‌ఆర్‌ఎస్ నేతలను భారీగా తమవైపు తిప్పుకోవచ్చని ప్రణాళికలు వేసింది. అందుకే ఈటెల రాజేందర్ పార్టీలో చెరగని చేరికల కమిటీ చైర్మెన్ పదవిని కట్టబెట్టింది. బి‌ఆర్‌ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరతారని, బి‌ఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని ఇలా ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తూ కాలం వెల్లధిస్తున్నారు.

కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం బీజేపీ నేతల ఒట్టి మాటలే అని విషయం అర్థమౌతోంది. ఎన్నో రోజుల నుంచి అటు బండి సంజయ్, ఇటు ఈటెల ఇద్దరు కూడా ఒకే విధంగా మాట్లాడుతూ.. దాదాపు 40 మంది బి‌ఆర్‌ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా ఏ క్షణం లోనైనా బీజేపీలో చేరే అవకాశం కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క బి‌ఆర్‌ఎస్ నేతను కూడా బీజేపీ వైపు తిప్పుకోలేకపోయారు కమలనాథులు. మునుగోడు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు ఎరా వేసే ప్రయత్నం చేసిన.. బి‌ఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు ఇచ్చిన షాక్ కు కమలనాథులు ఇప్పటికీ కూడా కోలుకోలేదు. ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు ఏ విధంగా డబ్బు ను ఎరా వేస్తారో కళ్ళకు కట్టినట్లుగా వీడియోతో సహ బీజేపీ దుశ్చర్యను బయట పెట్టారు సి‌ఎం కే‌సి‌ఆర్. ఎమ్మేల్యేలు కూడా బి‌ఆర్‌ఎస్ ను విడిచే ప్రసక్తే లేదని ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా అవన్నీ ఎండమావులే అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చారు.

దీంతో బి‌ఆర్‌ఎస్ నేతలను తమవైపు తిప్పుకోవడం అంతా ఈజీ కాదని బీజేపీకి స్పష్టంగా అర్థమైంది. ఇక బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన వారిని బీజేపీలోకి ఆకర్షించడం తప్పా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను లాక్కోవడం జరిగే పని కాదని కమలనాథులకు గట్టిగానే తెలిసొచ్చింది. అయితే బీజేపీ నుంచి నేతలను ఆకర్షించడం సంగతి అటుంచితే.. బీజేపీ నుంచి ఎవరు పార్టీ వీడకుండా చూసుకోవడమే కమలనాథుల ప్రస్తుత పని అయింది. కాగా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, బి‌ఆర్‌ఎస్ ను దెబ్బ తీయడం గ్యారెంటీ అని కమలం పార్టీ అధిష్టానంలో ఆశలు రేపిన ఈటెలపై అధిష్టానం కూడా గుర్రుగా ఉందట. ఏదో చేస్తాడని చేరికల కమిటీ పదవిస్తే.. ఏం జరగట్లేదే అని మొట్టికాయలు వేస్తోందట. దాంతో ఈటెల చేరికల కమిటీ పదవిపై పెదవి విరుస్తున్నారని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. మొత్తానికి ఏదో జరగబోతుందని ఆశించిన కమలం పార్టీ.. ఏం జరగకపోతుండడంతో డీలా పడినట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -