Etela:6 సీట్లు ఫైనల్..ఈటెల కు కష్టమేనా?

23
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సీట్ల కేటాయింపులో తగు జాగ్రత్తలు పాటిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఆ పార్టీని గట్టిగా దెబ్బ తీయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పరిస్థితి రిపీట్ కాకూడదని ప్రయత్నిస్తోంది. అందుకే ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే దానిపై రాష్ట్ర కమలనాథులు ముమ్మర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 17 లోక్ సభ స్థానాలకు గాను సిట్టింగులకే అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి, అందులో భాగంగానే ఆరు స్థానాలను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు వినికిడి. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, ఖమ్మం నుంచి డాక్టర్ వెంటకేశ్వర్లు.. వంటి వారిని ఫైనల్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈటెల రాజేందర్ కు సీటు కేటాయించడంపై అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. గత కొన్నాళ్లుగా తాను ఎంపీ ఎన్నికల బరిలో నిలుస్తానని అధిష్టానం ఛాన్స్ ఇస్తే మల్కాజ్ గిరి ఎంపీ సీటుకు పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే ఈటెలకు సీటు కేటాయించాలా లేదా ? అనే దానిపై అధిష్టానం కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల కోరిక మేరకు ఆయనకు రెండు సీట్లు కేటాయించిన అధిష్టానం రెండు చోట్ల కూడా కంగుతింది. అటు గజ్వేల్, ఇటు హుజూరాబాద్ రెండు స్థానాల్లో కూడా ఈటెల పరాజయం పాలయ్యారు. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఈటెల కోరిన సీటు అధిష్టానం ఇవ్వడం కష్టమే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఈటెలకు సీటు దక్కకపోతే ఆయన బీజేపీ వీడిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.

Also Read:Pawan:జనసేన బలహీనంగా ఉందా ?

- Advertisement -