134 శాతం పెరిగిన బీజేపీ ఆదాయం..

374
bjp
- Advertisement -

2018-19 సంవత్సరానికి గాను ఆదాయ,వ్యయ వివరాలను వెల్లడించింది భారతీయ జనతా పార్టీ. 2017-18తో పోలిస్తే బీజేపీ ఆదాయం 134 శాతం పెరిగింది. ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ప్రస్తుతం బీజేపీ ఆదాయం రూ.2,410 కోట్లు.

ఇందులో ఎలక్ట్రోరల్ బ్రాండ్ల ద్వారా రూ.1,450 కోట్లు వచ్చినట్లు వెల్లడించగా 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,005 కోట్లు ఖర్చుచేసినట్టు తెలియజేసింది.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆదాయం కేవలం రూ.918 కోట్లు అయితే, 2017-18తో పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం కావడం విశేషం. గడిచిన ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆదాయం గణనీయంగా పడిపోయినా, సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం భారీగా ఖర్చుచేసింది.

లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,ఒడిశా,సిక్కిం,అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల్లో మొత్తం రూ.820 కోట్లు ఖర్చుచేసినట్టు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదికలో కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.

- Advertisement -