టీఆర్ఎస్‌కు జై కొట్టిన బీజేపీ ఓటర్లు..!

168
vani devi
- Advertisement -

రాష్ట్రంలో జరిగిన రెండు ఎమ్మెల్సీ స్ధానాల్లో గులాబీ పార్టీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. పట్టభద్రులు సీఎం కేసీఆర్ పాలన వైపు మొగ్గుచూపగా ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, తామే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని విర్రవీగిన బండి సంజయ్‌కు ఆ పార్టీ నేతలు ఓటుతో బుద్ది చెప్పారు.

ముఖ్యంగా హైదరాబాద్- మహబూబ్ నగర్- రంగారెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవికి మద్దతిచ్చారు బీజేపీ ఓటర్లు. కాషాయ పార్టీ అభ్యర్థి రాంచందర్‌ రావుకు ఓటేసిన వారిలో 29 శాతం మంది దాదాపుగా 45 వేల మంది ఓటర్లు టీఆర్ఎస్‌కు ఓటేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేస్తూ విమర్శలు గుప్పించిన బీజేపీ నాయకత్వానికి ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇచ్చిన షాక్‌తో తల తీసేసినంత పనైంది.

ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో బీజేపీలోని గ్రూపు రాజకీయాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరం కాగా వరంగల్- నల్గొండ-ఖమ్మం స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి కాకుండా తీన్మార్ మల్లన్నకు మద్దతిచ్చారు. దీంతో ప్రేమేందర్ రెడ్డి సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కమలం పువ్వు కార్యకర్తలు కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక తమ నాయకుల వద్ద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలతో బీజేపీ గాలి తీసినట్లైయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -