తమిళ్ తంత్రం.. బీజేపీ ఏం చేయబోతుంది?

56
- Advertisement -

సౌత్ రాష్ట్రాలలో భాగంగా బీజేపీ ఫోకస్ చేస్తున్న రాష్ట్రాలలో తమిళనాడు కూడా ఒకటి. ఇక్కడ బలపడాలని అధికారం చేపట్టాలని కాషాయ పార్టీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఒంటరిగాను, ఇతర పార్టీలతో పొత్తుగాను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు మాత్రం కనిపించలేదు. అయినప్పటికి పార్టీ బలోపేతం కోసం కాషాయ పార్టీ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఇక వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతో పాటు.. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈసారి ఎలాగైనా ద్రావిడ రాష్ట్రంలో సత్తా చాటి కాషాయ జెండా ఎగురవేలాని చూస్తోంది. .

అయితే తమిళనాడులో డీఎంకే పార్టీ నుంచి బీజేపీకి గట్టిగానే పోటీ ఉంది. డీఎంకే అధినేత స్టాలిన్ బీజేపీ పై చేస్తున్న విమర్శలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ప్రజల్లో పార్టీకి ఉన్న ఇంపాక్ట్ తగ్గుతున్నట్లే తెలుస్తోంది. అందుకే కొత్త ఎత్తుగడలతో కాషాయ పార్టీ సిద్దమౌతోందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునేమో అనే సమాధానం కలుగక మానదు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై భేటీ అయ్యారు. ఈ బేటీ వెనుక ఉన్న కారణలపై తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Also Read:గ్యాస్ సమస్యలకు ఈ ఆసనంతో చెక్!

బీజేపీకి మద్దతుగా నిలిచే పార్టీల విషయంలో కొంత సంశమనం పాటించాలని నడ్డా అన్నామలై కి సూచించినట్లు వినికిడి. ముఖ్యంగా అన్నాడిఎంకే పార్టీ విషయంలో ఎలాంటి విమర్శలు చేయకూడదని, ఈ రెండు పార్టీల మద్య ఉన్న స్నేహబంధం మరింత బలపడే విధంగా ముందుకు సాగాలని నడ్డా కీలక సూచనలు చేశారట. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీ రాజకీయ సంక్షోభంతో కొట్టు మిట్టాడుతోంది. అలాగే బీజేపీ సింగిల్ గా సత్తా చాటే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు విడివిడిగా డీఎంకే పార్టీపై పోరుకు దిగితే.. అది డీఎంకే పార్టీకీ అనుకూలం అవుతుందనే ఆలోచనలో బీజేపీ ఉందట. అందుకే అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తూ ఆ పార్టీతో కలిసి డీఎంకే పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. మరి బీజేపీ వ్యూహాలు ఎంతవరుకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:చంద్రయాన్-3 విజయవంతం..నెక్స్ట్ టాస్క్ అదే!

- Advertisement -