గుర్మీత్ కు మద్దతు పలికిన బీజేపీ ఎంపీ..

182
BJP distances itself from MP Sakshi Maharaj's support to Ram Rahim
- Advertisement -

అత్యాచారం కేసులో నేరం రుజువై పోలీస్ క‌స్ట‌డీలో ఉన్న‌ డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ను బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వెన‌కేసుకొచ్చారు. అత్యాచారం కేసులో పంచకుల కోర్టు గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.

కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో లక్షలాది మంది గుర్మీత్ రామ్ రహీం సింగ్ అభిమానులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు.

 BJP distances itself from MP Sakshi Maharaj's support to Ram Rahim

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ కు మద్దతుగా మాట్లాడారు. ఒక వ్యక్తిపై అత్యాచారం ఆరోపణలు వస్తున్నాయి, అదే సమయంలో ఆయనకు మద్దతుగా లక్షల మంది గళమెత్తుతున్నారు. వారి అభిప్రాయాలను ఎందుకు వినరు అని ప్రశ్నించారు.

అంతేకాకుండాగుర్మీత్ రామ్ రహీంను బదనాం చేయడానికి కుట్రపూరితంగా ఆయనపై అత్యాచారం ఆరోపణలు తెరమీదకు తెచ్చారని అభిప్రాయపడ్డారు . భారత సంస్కృతి ప్రతష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరిగిందన్న అనుమానం కలుగుతోందని సాక్షి మహరాజ్ అన్నారు.

- Advertisement -