గత కొన్నాళ్లుగా బీజేపీలోని చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల రాజేంద్ర తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ అధిష్టానం ఆయనకు తగిన ప్రదాన్యం ఇవ్వడం లేదని ఇలా రకరకాల వార్తలు ఈటెల చుట్టూ తిరుగుతున్నాయి. దాంతో ఆయన పార్టీ మారతారనే చర్చ తరచూ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఒకానొక సందర్భంలో ఈటెల పార్టీ మారతారనే విషయాన్ని అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. దాంతో స్వయంగా ఈటెలనే పార్టీ మారడం లేదని క్లారిటీ ఇవ్వక తప్పలేదు. అయినప్పటికి ఆయన పార్టీ మార్పు పై వార్తలు ఆగడం లేదు. ఇదిలా ఉంచితే ఈ మద్య ఈటెలతో తరచూ అధిష్టానం బేటీ అవుతోంది. .
దాంతో ఈ బేటీకి అసలు కారణాలు ఎంటనే చర్చ ఊపందుకుంది. ఇక తాజాగా నేడు మరోసారి ఈటెల డిల్లీ పయనం అయ్యారు. ఈ రకంగా ఈటెలతో బీజేపీ అధిష్టానం సమావేశం కావడానికి అసలు విషయం ఎంటనే దానిపై విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. ఈటెల పార్టీ మార్పుపై క్లారిటీ సుకుకునేందుకే ఈ వరుస బేటీలు అనే కొందరు చెబుతుంటే.. కాదు కాదు ఆయనకు కీలక పదవి అప్పగించేందుకే ఈ బేటీ అంటూ మరికొందరు చెబుతున్నారు. అయితే గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై చర్చ జరుగుతోంది. బండి సంజయ్ స్థానంలో ఈటెలను నియమించే దిశగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
Also Read:ఎక్స్ పోజింగ్ ఏమిటి ? ఏమైనా చేస్తానంటుంది
అయితే అలాంటిదేమీ లేదని గతంలేనే క్లారిటీ ఇచ్చారు ఈటెల. కాగా చేరికల కమిటీ చైర్మెన్ పదవి రాక మునుపు ఈటెల స్టార్ క్యాంపైనర్ పదవి ఆశించారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు అధిష్టానం పట్టించుకోలేదు. ఇప్పుడు కర్నాటక ఎన్నికల ఓటమి తరువాత తెలంగాణ ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో పార్టీకి మైలేజ్ తీసుకోచ్చేందుకు ఈటెల మాత్రమే సమర్థుడని అధిష్టానం భావిస్తోందట. అందుకే ప్రచాక కమిటీ చైర్మెన్ హోదా బాధ్యతను ఈటెల భుజలపై పెట్టేందుకు బీజేపీ పెద్దలు సిద్దమయ్యారట. ఈ విషయంపైనే ఈటెలతో నేడు అధిష్టానం చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే చేరికల కమిటీ చైర్మెన్ గా పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈటెల ప్రచార కమిటీ చైర్మెన్ గా ఎంతవరకు సత్ఫలితలు తెస్తారనేది చూడాలి.
Also Read:అంబలితో ఆరోగ్యం..