బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ

85
bjp ts
- Advertisement -

జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవనున్నారు. బండి సంజయ్ నేతృత్వంలో కార్పొరేటర్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనుండగా సాయంత్రం 4 గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై కార్పొరేటర్లకు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు.

వాస్తవానికి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడే కార్పొరేటర్లతో ప్రధాని భేటీ కావాల్సి ఉంది. అయితే ఆ సమావేశం అనూహ్యంగా వాయిదా పడింది. గతంలో జీహెచ్ఎంసీలో బీజేపీ నుంచి నలుగురు కార్పొరేటర్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కాగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సంఖ్య 47కి పెరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని సీట్లను ఈజీగా గెలవాలంటే క్షేత్ర స్థాయిలో కార్యకర్తల కృషి ఎంతో అవసరం అందుకే ప్రధాని కార్పొరేటర్లతో భేటీ కానున్నారు.

- Advertisement -