- Advertisement -
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణ కులం సభ్యులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు దాదాపుగా 200 మంది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా వేసి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరినవారిలో ముఖ్య నాయకుల్లో రాజేశ్వర్,శ్రీను,పురుషోత్తం,వెంకటేష్,వెంకట్,కిషన్,గరుడాద్రి, డాక్టర్ మహేంధర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద్ పేట్ గ్రామ సర్పంచ్ గంగాధర్, PACs ఛైర్మన్ బంటు మహిపాల్, మాజీ ఎంపిటీసిలు ప్రభుదాస్, ఈ.గంగాధర్, అప్పాల సురేష్,అప్పాల గణేష్,నోముల గణేష్,గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -