బీజేపీ సర్వనాశనం.. కారణమదే ?

45
- Advertisement -

తెలంగాణలో కాషాయ పార్టీ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. ఆధిపత్య విభేదాలు, గ్రూప్ రాజకీయాలు, అసమ్మతి సెగలు.. ఇలా ఒక్కటేంటి ఎన్నో సమస్యలు ఆ పార్టీని చుట్టుముట్టాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లుతున్న కాషాయ పార్టీకి ఈ సమస్యలన్నీ తీవ్ర తలనొప్పిగా మారాయి. బీజేపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తమ విధానాలు సిద్దాంతలు ఇతర పార్టీలకు ఆదర్శమని జాతీయ నేతలు చెబుతుంటారు.

కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ పరిస్థితి సీన్ రివర్స్ అయేలా ఉంది. పార్టీ నేతలు చేసే అసంబంధిత వ్యాఖ్యలు, ఆఫ్ నాలెడ్జ్‌తో చేసే విమర్శలు పార్టీని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని కాషాయ పార్టీలోనే ఓ వర్గం వాపోతుంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ బాస్ బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. మత విద్వేషాలు పెంచేలా మాట్లాడడం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, తరచూ జైలు పాలు కావడం వంటి పరిణామాలతో బీజేపీ పరువును బండి మంటగలుపుతున్నారనే టాక్ ఉంది. ఇదిలా ఉంచితే ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగాయనే టాక్ నడుస్తోంది.

Also Read: ఆ తిలకం మర్చిపోలేను… ఫడ్నవీప్ ఉద్వేగం

అధ్యక్ష పదవి కోసం ఈటల గట్టిగా ప్రయత్నిస్తుండడం, బండి సంజయ్ కి ఈటల కు దూరం పెరగడంతో ఈటల వర్గం బండి వర్గం అంటూ పార్టీలో అంతర్లీనంగా చీలిక ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు దర్మపురి అరవింద్, రఘునందన్ వంటి వారు అసలు పార్టీలో ఉన్న లేనట్లే అన్నట్లు వ్యవహరిస్తుండడంతో ఎవరికి వారే అన్నట్లుగా బీజేపీ పరిస్థితి తయారైంది. ఇక ఒకరికి ఒకరు సంబంధం లేకుండా పార్టీ బలోపేతం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితాలు శూన్యం అని కొందరి అభిప్రాయం. మరి ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఏర్పడిన ఈ అసంబద్దత ను హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Also Read: మోడీకి బి‌ఆర్‌ఎస్ భయం పట్టుకుందా.. ?

- Advertisement -