ఒడిశాలో బీజేడీతో బీజేపీ!

20
- Advertisement -

ఒడిశాలో కొత్త పొత్తు పొడిచింది. అధికార బీజేడీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనుంది బీజేపీ. ఇక పొత్తులో భాగంగా బీజేడీకి 13, బీజేపీ 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. వాస్తవానికి వీరిద్దరూ పాతమిత్రులే. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్లి బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనుంది బీజేడీ.

ఒడిశాలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేడీ, బీజేపీలు మొదటిసారిగా 1998 ఎన్నికల్లో కలిసి పోటీచేశారు. 11 ఏండ్లపాటు కొనసాగిన ఇరు పార్టీల స్నేహానికి 2009లో బ్రేక్‌ పడింది.సీట్ల పంపకాల్లో తేడా రావడంతో బీజేడీతో తెగతెంపులు చేసుకుంది బీజేపీ. అయితే తాజాగా జరగనున్న ఎన్నికల్లో మళ్లీ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.

Also Read:మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి

- Advertisement -