బీజేపీ నూతన పార్లమెంటరీ బోర్డు మెంబర్స్‌

25
bjp
- Advertisement -

భారతీయ జనతా పార్టీలోని సీనియర్లను పక్కన పెడుతూ వస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి నితీన్‌ గడ్కరీ, మద్యప్రదేశ్‌ సీఎం శివారాజ్‌ సింగ్‌ చౌహన్‌ తప్పించి నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డును ప్రకటించారు జేపీ నడ్డా. ఇందులో కర్ణాటకకు చెందిన బీయస్‌ యడ్యూరప్ప, బీఎల్‌ సంతోష్‌లకు బోర్డులో స్థానం సంపాందించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాతో పాటు మరో తొమ్మిది సభ్యులతో ఏర్పాటు చేసిన బోర్డులో రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీనడ్డా, బీఎస్‌ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్‌, కే లక్ష్మణ్‌, ఇక్బాల్‌ సింగ్‌ లాల్పురా, సుధా యాదవ్‌, సత్యనారాయణ జాఠియా, బీఎల్‌ సంతోష్‌ను సభ్యులుగా నియమించింది.

బీజేపీ 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని కూడా ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు జేడీ నడ్డా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ రెండు కమిటీల్లో మోదీ సర్కార్‌లో అత్యంత సీనియర్‌ మంత్రి గడ్కరీకి స్థానం దక్కకపోవడం గమనార్హం. మరో పక్క పార్టీ పెట్టుకొన్న 75ఏళ్ల వయో పరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడ్యూరప్ప ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కించుకోవడం విశేషం ఆయనకు ఉన్న పట్టు కారణంగా పార్టీలో కేంద్ర కమిటీల్లో స్థానం దక్కించుకొన్నారు.

- Advertisement -