రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం

11
- Advertisement -

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను అమోదించింది బీజేపీ. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ప్రకటించారు. రామచందర్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెల జూన్ 30న రాజీనామా చేశారు రాజాసింగ్.

రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అమోదించడంతో గోషామహల్‌కు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. రాజాసింగ్‌ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాయనుంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం.

తెలంగాణ బీజేపీలో కొందరు బడా నాయకులు పార్టీని నాశనం చేస్తున్నారు అని రాజాసింగ్ మండిపడిన సంగతి తెలిసిందే. పార్టీకోసం కష్టపడిన వాడిగా నా కళ్ళముందే పార్టీ నాశనం అవడం చూడలేక రాజీనామా చేశాను అని తెలిపారు. అణచివేతను భరించే శక్తి ఇక నాకు లేదు అన్నారు.

Also Read:కన్వర్ యాత్ర..ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -