టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యమని, తెలంగాణ రాష్ట్రంపై బిజేపి వివక్ష చూపిస్తుందంటూ, ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందంటూ బిజేపి, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌ల సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని హన్మకొండలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పోరేటర్ కానుగంటి శేఖర్, కడిపికొండ బ్రిడ్జీ వద్ద జరిగిన ప్రచారసభలో కాజీపేటకు చెందిన పసునూరి మనోహర్, 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొంకటి దయాకర్, నాయకులు కొడవటి రవి, ఉస్కెల కుమార్, మైనార్టీ సెల్ నాయకులు దస్తగిరిలతోపాటు, బిజేపి నాయకులు కొత్త రవిలతో పాటు 76 మందికి టిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అలాగే సోమిడిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా సుంచు కృష్ణకు మద్దతుగా పేయింటింగ్ యూనియన్ మద్దతు ప్రకటిస్తూ.. టిఆర్ఎస్ పార్టీలో చేరిన యూనియన్ నాయకులు ఇనుగాల సతీష్, కనకం శివకుమార్, ఆవారి లక్ష్మణ్, బస్కె రాజు, ఇనుగాల రాజు, కుమ్మరి సుధీర్, శ్రీధర్‌లతో పాటు 20 మంది మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అబద్దాల పార్టీ, మోసకారి పార్టీ బిజేపిని ప్రజలు తిరస్కరిస్తున్నారని, రెచ్చగొట్టె మాటలతో ఓట్లు పొందాలని చూస్తున్నవారికి బుద్దిచెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై వివిక్ష చూపిస్తున్న బిజేపి పార్టీని బొందపెట్టుడు ఖాయమన్నారు. సచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి, కేడర్ కరువై కోట్లుమిట్టాడుతుందన్నారు.