కర్ణాటకలో అధికారం కోసం గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, బిజెపిలు హోరాహోరిగా ప్రచారాలు చేశాయి. అధికారం తమదంటే తమది అంటూ ఇరు పార్టీల నేతలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితులు చూస్తుంటే కర్ణాటకలో బిజెపి అధికారం చేపట్టే అన్ని సీట్లు ఇప్పటికే కైవసం చేసుకుంది. అధికారం చేపట్టడం కోసం కావల్సిన మ్యాజిక్ ఫిగర్ బీజేపీ ఇప్పటికే దాటేసింది. ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకొవచ్చు. మళ్లి అధాకారంలోకి వస్తామనే ధీమాతో కర్ణాటకలో ప్రచారం చేశారు కాంగ్రెస్ నేతలు.
ఒకవైపు ఈ ఫలితాలు రాహుల్ గాంధీ భవితత్వాన్ని తేల్చేవి అని కూడా చెప్పుకొవచ్చు. దేశంలో అతిఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. ఇప్పటివరకూ 108సీట్లు ఆధిక్యంలో
చేసకున్న బీజేపీ ఇంకా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి రెండవ స్దానంలోనే ఉంది. 100కు పైగా సీట్లు సాధిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు..ప్రస్తుతం 70సీట్లలోపే పరిమితమయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో పార్టీ జేడీఎస్. మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు కుమారస్వామి ఈ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
తాజా సర్వేలు చెప్పిన ప్రకారం కర్ణాటకలో హంగ్ ఎర్పడితే జేడీఎస్ కింగ్ మేకర్ గా నిలబడుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు చూస్తున్న ఫలితాలను బట్టి గమనిస్తే హంగ్ ఏర్పడే దాఖలాలు కూడా లేవు. ఒక ఒకవేళ కాంగ్రెకు జేడీఎస్ మద్దతు పలికినా బిజెపి ని అందుకొలేరు. ప్రస్తుతం జేడీఎస్ 45సీట్లకే పరిమితయ్యింది. ఇక కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుండటంతో కన్నడ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ ఇతరులు
108 65 43 1