బిత్తిరి సత్తి హీరోగా ‘తుపాకీ రాముడు’..

307
- Advertisement -

తీన్మార్ వార్తలతో పాపులర్ యాంకర్‌గా మారిన బిత్తిరి సత్తి.. ఆడియో వేడుకల్లోనూ, సెలబ్రిటీ ఈవెంట్స్‌లోనూ మెరుస్తున్నాడు. ఇటీవల చిన్న చిన్న పాత్రల్లో సినిమాల్లోనూ కనిపించిన బిత్తిరి సత్తి హీరోగా మారారు. ‘తుపాకి రాముడు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలో ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశాడు.

Tupaki Ramudu

ఈ మూవీని ‘బతుకమ్మ’ ఫేమ్ – సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాతలు తెలిపారు.

- Advertisement -