బీఆర్ఎస్‌లోకి బిత్తిరి సత్తి!

59
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే వలసలతో కారు జోరు మీదుండగా తాజాగా బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అలాగే ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి సైతం త్వరలో బీఆర్ఎస్‌లో చేరనున్నారు.

ఇక బీజేపీకి రాజీనామా చేసిన మోహన్ రెడ్డి.. విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నారన్నారు.

బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ త్వరలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. పార్టీ కీలక నేతలు ఇప్పటికే చర్చలు జరుపగా చేరికపై గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. బిత్తిరి సత్తితో పాటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మరి కొంతమంది కీలక నేతలు కూడా త్వరలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Also Read:నవంబర్ 11న ‘దీపావళి’

- Advertisement -