Gold Price:లేటెస్ట్ ధరలివే

37
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 56,800గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 160 పెరిగి రూ. 61,960 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 56,950గా ఉండగా 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 160 రూ. 62,110గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 500 పెరిగి రూ. 78 వేలుగా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ. 500 పెరిగి రూ. 75,100గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1988 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ ధర 22.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Also Read:ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక..

- Advertisement -