- Advertisement -
గ్రేటర్ పరిధిలో జనన,మరణ ధృవీకరణ పత్రాలపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి మీ సేవా కేంద్రాల్లో జనన, మరణ ధ్రువపత్రాలను తీసుకోవచ్చునని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లలో కూడా ఈ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని వెల్లడించారు.
ఈ సెంటర్లకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని …..అయితే, ఈ సబ్‌రిజిస్ట్రార్లు జనన, మరణాలు జరిగిన 30 రోజుల్లో వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తారని చెప్పారు అధికారులు. గడువు దాటిన తరువాత వచ్చే దరఖాస్తులను రిజిస్ట్రార్ హోదాలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ అధికారులు పరిశీలించి, జారీ చేస్తారని చెప్పారు. జీహెచ్ఎంసీ తాజా నిర్ణయంతో నగర ప్రజలు జీహెచ్ఎంసీ ప్రాంతీయ కార్యాలయాల చుట్టు తిరిగే శ్రమ తగ్గనుంది.
- Advertisement -