బర్డ్ ఫ్లూ.. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే!

16
- Advertisement -

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు అమాంతం పడిపోగా చికెన్ తినేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. ప్రధానంగా తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో వేలాది కోళ్లు చనిపోగా పలు పౌల్ట్రీ ఫామ్ లను అధికారులు సీజ్ చేశారు.

ఇక తాజాగా సిద్ధిపేట జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగింది. తోగుల మండలం కాన్గల్ లోని లేయర్ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో వెటర్నరీ డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. ఫామ్ లో ఐదు షెడ్లలో ఉన్న మొత్తం 1.45లక్షల కోళ్లను చంపి పూడ్చి పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

అలాగే కాన్గల్ గ్రామం పరిధిలోని ఫౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ గ్రామంలో మొత్తం 512 కుటుంబాలు, 2,400 జనాభా ఉండగా.. ఆశా వర్కర్లు బుధవారం 150 ఇండ్లలో సర్వే చేశారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన ఫామ్ కు కిలో మీటర్ పరిధిలో ఉన్న ఫామ్స్ లో ఉన్న కోళ్లను చంపేస్తామని అధికారులు తెలిపారు.

Also Read:శ్రీవారి సేవలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ టీమ్

- Advertisement -