ప్ర‌ముఖ హీరోయిన్ కు అస్వ‌స్ధ‌త‌..ఆసుప‌త్రికి త‌ర‌లింపు

262
bipsabau
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ న‌టీ, హీరోయిన్ బిపాసాబ‌సు స్వ‌ల్ప అస్వ‌స్ద‌త‌కు గురైంది. గ‌త కొద్ది రోజుల నుండి ఆమె ఆరోగ్యం బాగా లేక‌పోవ‌డంతో సినిమాల‌కు దూరంగా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం నుంచి బిపాసాబసు శ్వాసకోశ సంబ‌ధిత వ్యాధితో బాధ‌ప‌డుతోంది. ప‌లు సార్లు అమె ఆసుప‌త్రికి వెళ్లిన త‌గ్గ‌క‌పోవ‌డంతో నేడు మ‌రోసారి ఆమెకు వ్యాధి ఎక్కువ కావ‌డంతో ఆమెను ఆసుప‌త్రిలో చేర్చారు కుటుంబ‌స‌భ్యులు.

bipsabau, karan singh

శ్వాస‌కోస సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న బిపాస‌బ‌సు ప‌లుమార్లు ఆసుప‌త్రికి వెళ్లినా వ్యాధి త‌గ్గ‌క‌పోవ‌డంతో…వ్యాధి కొంచెం ఎక్కువ కావ‌డంతో మ‌రోసారి ముంబైలోని ఓ ఆసుప‌త్రిలో చేర్చారు. ప్ర‌స్తుతం ఆమెకు ప్ర‌ముఖ డాక్ట‌ర్ ప‌ల్మ‌నాల‌జిస్ట్ ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. మ‌రికొన్ని రోజులు ఆమె ఆసుప‌త్రిలోనే ఉండే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. బిపాస‌బ‌సు ఇటివ‌లే బాలీవుడ్ న‌టుడు క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ ను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే విరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు.

- Advertisement -