హెచ్ఐసీసీలో బయో ఆసియా సదస్సు

30
- Advertisement -

రాష్ట్రాన్ని నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చెలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్దం చేశారన్నారు మంత్రి శ్రీధర్ బాబు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు…ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదిక అవ్వడం సంతోషంగా ఉందన్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు ₹ 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అన్నారు.పారిశ్రామికవేతలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తుందని…దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం అన్నారు.

కేవలం పరిశ్రమల స్థాపనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఉద్యోగాల కల్పన చేసే విధంగా పాలసీ రూపొందిస్తాం అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు, ఆయా రంగాల్లో నైపుణ్యం కోసం తగిన శిక్షణ ఇచ్చేలా విధానం రూపొందిస్తున్నాం అన్నారు. బయో ఏషియా సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరయ్యారు. బయో ఆసియా సదస్సులో జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషద పరికరాల ప్రోత్సహకాలపై చర్చలు జరపనున్నారు.

Also Read:చేపలు తింటే ఆ సమస్యలన్ని దూరం !

- Advertisement -