- Advertisement -
తిరుమల శ్రీవారిని దర్శించుకుంది బింబిసార చిత్రయూనిట్. వచ్చే నెల 5న సినిమా ప్రేక్షకుల మందుకురానుండగా హీరో కళ్యాణ్ రామ్.. చిత్ర బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్చనం అందించారు.
ఆగస్టు 5న తమ బింబిసార చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు కళ్యాణ్ రామ్. కథ వస్తే జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తానని……. సినిమా విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్ధిస్తూ, స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామన్నారు.
- Advertisement -