గేట్స్ మెచ్చిన వెబ్‌సిరీస్..బోర్గెన్‌

36
- Advertisement -

ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ తాజాగా తన గేట్స్ బ్లాగ్‌లో ఆసకికరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో తనకు ఎంతగానో నచ్చిన బోర్గెన్ అనే వెబ్‌సిరీస్‌ గురించి కూడా ప్రస్తావించారు. అలాగే ఈ వేసవిలో చదవదగ్గ బుక్స్‌ లిస్ట్‌ను కూడా చెప్పారు. అంతేకాదు మ్యూజిక్ ఆల్బమ్ లిస్ట్‌ కూడా చెప్పారు. బిల్‌గెట్స్‌కు సోషల్‌ మీడియా చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.

Also Read: జూన్‌ 8 నుంచి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్:తలసాని

లింక్డ్‌ఇన్‌లో 34మిలియన్ల మంది ఉన్నారు. తన బ్లాగ్‌ అయిన గెట్స్ బ్లాగ్‌లో బోర్గెన్ గురించి వివరించారు. ఇది డానిష్ పొలిటకల్ డ్రామా. అమెరికాలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉందని వివరించారు. క్లిష్ట రాజకీయ పరిస్థితులను అక్కడి తొలి మహిళా ప్రధాని ఎలా అధిగమించారో దీంట్లో చక్కగా చూపించారని అని చెప్పుకొచ్చారు. ఈ సిరీస్‌ నుంచి చాలా నేర్చుకున్నట్టు తెలిపారు. అలాగే ఈ సమ్మర్ కానుకగా రెండు పుస్తకాలను సిఫార్సు చేస్తున్నానని అన్నారు. వాటిలో ఒకటి నవల కాగా రెండొది నాన్‌ ఫిక్షన్ అని వివరించారు. అవి బార్న్ ఇన్ బ్లాక్‌నెస్‌ బై హవర్డ్ ఫ్రెంఛ్ మరియు టూమారో అండ్ టూమారో అండ్ టూమారో బై గాబ్రెయిల్ జెవీన్.

Also Read: KTR:హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌..మరీ మీకు ఎవరు.?

- Advertisement -