మన సినిమాకి ఫిదా అయిన బిల్ గేట్స్‌..!

208
Bill Gates is impressed with Akshay Kumar starrer
- Advertisement -

బిల్ గేట్స్…మామూలు వ్యక్తి కాదు. ఆయనో ప్రపంచ కుబేరుడు. అయితే ఈ కుబేరున్ని ఇండియన్‌ సినిమా టచ్‌ చేసింది. రియల్ వాస్తవాలకు రీల్ ట్రీట్ మెంట్ ఇస్తూ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా, శ్రీనారాయణ్ సింగ్ దర్శకత్వం వచ్చిన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ సినిమా బిల్‌ గేట్స్‌ ని ఫిదా చేసింది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. నిజానికి మన సినిమాల్ని మనమే సరిగ్గా చూడకుండా..ఎందులో ఏ తప్పు దొరుకుతుందోనని చూసే ఈ రోజుల్లో..బిల్‌ గేట్స్‌ చేసిన ట్వీట్‌ ఆలోచింపజేస్తోంది.

 Bill Gates is impressed with Akshay Kumar starrer

రియల్ స్టోరీని రీల్ గా మలచిన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ మూవీపై గేట్స్ స్పందిస్తూ.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలిపి ప్రజలు మేల్కొనేలా చేశారు. భారతదేశంలోని పారిశుద్ధ్య సవాళ్ల గురించి ఈ సినిమాతో ప్రేక్షకులకు తెలిసేలా చేశారని ఆయన ట్వీట్‌ ద్వారా పేర్కొన్నారు.

సినిమాలో మంచి ఉంటే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందేనని బిల్‌గేట్స్ ట్వీటే నిదర్శనమని మరోమారు రుజువైంది. ఇలాంటి వ్యక్తికి ఇండియన్ మూవీస్ నచ్చుతాయా? అన్న సందేహానికి తాజా ఆయన ట్వీట్ తో సమాధానం దొరికేసినట్లే.

- Advertisement -