బీహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం!

4
- Advertisement -

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2005 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఆయన రాజ్యసభకు వెళ్లే నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశముందని సమాచారం.

ఇది జరిగినట్లయితే బీహార్‌లో మొదటిసారి బీజేపీకి చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లో బీజేపీకి సీఎం లేని ఏకైక రాష్ట్రం బీహార్‌గా ఉంది.

బీజేపీ నుంచి సీఎం పదవికి పోటీదారులు

సీఎం పదవి కోసం బీజేపీ నుంచి పలువురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా:

Samrat Choudhary – తారాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్‌పై 45,843 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Nityanand Rai – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఉజియార్‌పూర్ లోక్‌సభ సభ్యుడు.

Vijay Kumar Sinha – 2010 నుంచి లక్షీసరాయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం.

Sanjeev Chaurasiya – దిగ్ఘా నియోజకవర్గ ఎమ్మెల్యే. 2025 ఎన్నికల్లో సీపీఐ-ఎంఎల్ అభ్యర్థిపై 59,079 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Nitish Mishra – మధుబనీ జిల్లాలోని ఝంజార్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే.

Dilip Jaiswal – బీహార్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మూడుసార్లు ఎమ్మెల్సీ.

Ram Kripal Yadav – ప్రస్తుతం వ్యవసాయ మంత్రి.

Janak Ram – షెడ్యూల్డ్ కులాలు, గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి.

ఎన్‌డీఏ కూటమి అంతర్గత చర్చల అనంతరం బీజేపీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read:Iran: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా

ఇక మరోవైపు, నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశముందని సమాచారం. ఆయనను బీహార్ మంత్రివర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక బీహార్ నుంచి ఐదు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఎన్‌డీఏ నాలుగు స్థానాలను సులభంగా గెలుచుకునే అవకాశం ఉండగా, ఐదవ స్థానానికి పోటీ ఉండే అవకాశముంది.

- Advertisement -