- Advertisement -
ఓ చాయ్ వాలా ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. బిహార్ లో అభిషేక్ కుమార్ అనే చాయ్ వాలా ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు.ఈ సోదాల్లో రూ.1.05 కోట్ల నగదు, 344 గ్రాముల బంగారం, 1.75 కేజీల వెండి గుర్తించారు.
75 బ్యాంక్ పాస్ బుక్స్, 28 చెక్ బుక్స్, ఆధార్ కార్డులు, ల్యాప్ టాప్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు అభిషేక్ కుమార్ పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు.
అంతేగాదు అంతరాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ లీడర్ గా అభిషేక్ కుమార్‌ను గుర్తించి పోలీసులు షాక్ అయ్యారు.
Also Read:TTD:కార్తీకమాస పూజ మహోత్సవాలు
- Advertisement -

