జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనాయో తకైచి ఎన్నికయ్యారు. పార్లమెంటు దిగువ సభలో జరిగి ఎన్నికలో మొత్తం 465 ఓట్లకుగానూ 237 ఓట్లు సాధించారు లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నాయకురాలు సనాయో తకైచి.
ఐరన్ లేడీ ఆఫ్ జపాన్ గా గుర్తింపు పొందారు సనాయో తకైచి. ఒక సంవత్సరం మాత్రమే పదవిలో ఉన్న ప్రధానమంత్రి ఇషిబా మంగళవారం తన కేబినెట్‌తో కలిసి రాజీనామా చేయడంతో తకైచీకి ప్రధానిగా ఎన్నికకు మార్గం సుగమమైంది.
ప్రస్తుతం రాజకీయ స్థిరత్వం చాలా అవసరం..అని సోమవారం జపాన్ ఇన్నోవేషన్ పార్టీ నేత, ఓసాకా గవర్నర్ హిరోఫుమి యోషిమురాతో కూటమి ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా టాకైచీ అన్నారు. స్థిరత్వం లేకుండా మేము బలమైన ఆర్థిక వ్యవస్థ లేదా విదేశాంగ చర్యలు తీసుకోలేము అని వెల్లడించారు.
హత్యకు గురైన మాజీ ప్రధానమంత్రి షింజో ఆబే శిష్యురాలిగా ఉన్న టాకైచీ, ఆయన విధానాలను — బలమైన రక్షణ వ్యవస్థ, ఆర్థిక పునరుద్ధరణ మరియు జపాన్ శాంతి రాజ్యాంగంలో మార్పులు — కొనసాగించే అవకాశం ఉంది.
Also Read:TTD:కార్తీకమాస పూజ మహోత్సవాలు

