బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో భాగంగా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించు కున్నారు. సీఎం నీతీశ్ కుమార్, విపక్ష సీఎం అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ఓట్లు వేశారు.
బఖ్తియార్పుర్లోని మంజు సిన్హా ప్రాజెక్ట్ గర్ల్స్ హైస్కూల్లో ఉదయం 10:05 గంటలకు ముఖ్యమంత్రి నీతీశ్ ఓటు వేశారు. అనంతరం తన పూర్వీకుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పట్నా వెటర్నరీ కళాశాలలోని పోలింగ్ బూత్‌లో విపక్ష సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, లాలూ సతీమణి రబ్రీ దేవి, రోహిణి ఆచార్య, మీసా భారతి, తేజస్వి యాదవ్ సతీమణి రాజశ్రీ ఓట్లు వేశారు. ఈనెల 14న కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు తేజస్వి. లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య తన తండ్రి పక్కనే నిలబడి, ఆయన నీడలా వ్యవహరించారు.
#WATCH | Bakhtiyarpur, Patna: Bihar CM Nitish Kumar shows his inked finger after casting his vote in the first phase of #BiharElections2025. pic.twitter.com/QeXWHKsUhx
— ANI (@ANI) November 6, 2025
Also Read:భారత మహిళ జట్టుకు ప్రధాని ప్రశంసలు

