Bihar:కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం

6
- Advertisement -

బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు మహారాష్ట్ర మజ్లిస్ చీఫ్ ఇంతియాజ్ జలీల్ దీటుగా బదులిచ్చారు. రాహుల్ గాంధీ… ఒవైసీ హైదరాబాద్ నుంచి వచ్చి బీహార్ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించిన దానికి, ఇంతియాజ్ జలీల్ కౌంటర్ ఇస్తూ, “మరి రాహుల్ గాంధీ అమ్మ ఇటలీ నుండి ఎందుకు వచ్చిందని మేము ఏం అనడం లేదు కదా” అని పరోక్షంగా సోనియా గాంధీ నేపథ్యాన్ని ప్రస్తావించారు.

కాంగ్రెస్ పార్టీలో మజ్లిస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కాంగ్రెస్ ఎంపీ మరియు కాంగ్రెస్ నేషనల్ మైనారిటీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ప్రతాప్‌గ్రహి, అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకుపడ్డారు.

అసదుద్దీన్ అక్కడేమో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతున్నాడు. ఇక్కడేమో అదే అసదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టాలని అభ్యర్థులను పెడుతున్నాడు. నీ రెండు కళ్ళ సిద్దాంతం ఇక్కడ నడవదు అని ఇమ్రాన్ ప్రతాప్‌గ్రహి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Also Read:ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

- Advertisement -